#OPPOReno3Pro మార్చి 2న విడుదల.. డుయెల్ హోల్ సెల్ఫీ కెమెరాలు
ఒప్పో నుంచి రెనో3ప్రో భారత మార్కెట్లోకి రానుంది. మార్చి రెండో తేదీన ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోనులో 44 మెగా పిక్సల్ డుయెల్ హోల్ పన్చ్ సెల్ఫీ కెమెరాలు వుండటమే ఈ ఫోన్ విశేషం.
ప్రపంచంలోనే ఒప్పో రెనో 3 ఫోనులోనే 44 మెగా పిక్సల్ డుయెల్ హోల్ పన్చ్ సెల్ఫీ కెమెరాలు వుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోనుకు చెందిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఒప్పో రెనో 3 ప్రో చైనాలో గత ఏడాది విడుదలైంది. ఈ ఫోను 5జీని సపోర్ట్ చేయగలదు. అయితే మార్చిలో భారత్‌లో విడుదలయ్యే ఒప్పో రెనో 3 ప్రో 4జీని సపోర్ట్ చేస్తుంది.
ఎస్ఓసీ టెక్నాలజీని కలిగిన ఈ ఫోను ఫీచర్లు త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ ఫోన్ 8జీబీ రామ్, 128 జీబీని.. జెట్ బ్లాక్ రంగులో లభ్యమయ్యే అవకాశం వుంది.