శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (10:51 IST)

రిషబ్ పంత్ అదరగొట్టేశాడు.. కష్టాలు ఎవరికి?

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడటంతో.. అతడు తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సాహాకు కష్టాలు తప్పవని సమాచారం. న్యూజిలాండ్ లెవన్ జట్టుతో ఈ నెల 14వ తేదీన ఆరంభమైన మూడు రోజుల క్రికెట్ టెస్టు మ్యాచ్, తొలి ఇన్నింగ్స్‌లో ఆడిన భారత జట్టు 263 పరుగులు సాధించింది. 
 
వికారి 101 పరుగులు, పుజారా 93 పరుగులు సాధించారు. తదనంతరం బరిలోకి దిగిన కివీస్ లెవన్ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. అటుపిమ్మట రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు సాధించింది. ఇందులో రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 70 పరుగులు సాధించాడు. ఇందులో 4 సిక్సర్లు వున్నాయి. 
 
టీమిండియా ఇటీవల ఆడిన మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ మెరుగ్గా రాణించలేకపోయాడు. అయితే ప్రస్తుత మ్యాచ్‌లో నిలకడగా ఆడిన కారణంగా ఈ నెల 21వ తేదీ నుంచి కివీస్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వికెట్ కీపర్‌గా వున్న సాహెల్‌కు కష్టాలు తప్పవని.. అతనిని తొలగించి అతని స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకునే ఛాన్సుందని తెలుస్తోంది.