శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (15:06 IST)

అసలేం జరిగింది? పీటీ ఉషకు ప్రధాని మోడీ ఫోన్... వినేశ్‌‍కు ధైర్యవచనాలతో ట్వీట్!

vinesh phogat
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో మహిళల రెజ్లింగ్ పోటీల్లో భాగంగా 50 కేజీల కేటగిరీలో భారత్‌కు స్వర్ణం లేదా కాంస్యం పతకాల్లో ఏదో ఒకటి వస్తుందని ప్రతి ఒక్కరూ ఆశించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాముల బరువు అధికంగా ఉన్నారని పేర్కొంటూ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. దీంతో వినేశ్‌పై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరంద్ర మోడీ సహా అందరూ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వినేశ్ అనర్హతపై ప్రధాని మోడీ భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉషకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌‍లో అసలేం జరిగిందంటూ ఆయన వివరాలు సేకరించారు. వినేశ్ ఫొగాట్ అనర్హతకు దారితీసిన అంశాలను ప్రధానికి పీటీ ఉష వివరించారు. 
 
అంతేకాకుండా వినేశ్‌కు మనం ఏమైనా సాయపడగలమా? ఏమైనా మార్గాలు ఉన్నాయా? అని ప్రధాని అడిగారు. ఒకవేళ వినేశ్‌కు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటే ఒలింపిక్స్‌లో గట్టిగా నిరసన తెలపండి అంటూ పీటీ ఉషకు ప్రధాని మోడీ సూచించారు. అదేసమయంలో వినీశ్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇదిలావుంటే, వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై భారత్ ప్రొటోకాల్ ప్రకారం అప్పీల్ చేసినట్టుగా తెలుస్తుంది. 50 కిలోల విభాగంలో బుధవారం రాత్రి అమె ఫైనల్ పోటీలో తలపడాల్సివుంది. కానీ, ఉదయం ఆమెకు 50 కేజీల బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉన్నారు. దీంతో ఒలింపిక్స్ అసోసియేషన్ అనర్హత వేటు వేసింది. ఈ పరిణామంతో యావత్ భారత్ షాక్‌కు గురైంది.