బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 మే 2018 (09:18 IST)

ఫ్రెంచ్ ఓపెన్ : బోపన్న జోడీ శుభారంభం.. నాదల్ కూడా..

పారిస్ వేదికగా ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ తొలిరౌండ్‌లో రోహాన్ బోపన్న- రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ శుభారంభం చేయగా, సి

పారిస్ వేదికగా ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ తొలిరౌండ్‌లో రోహాన్ బోపన్న- రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ శుభారంభం చేయగా, సింగిల్స్ ఆటగాడు యూకీ భాంబ్రీకి చుక్కెదురైంది.
 
మంగళవారం జరిగిన తొలిరౌండ్‌లో ఇండో-ఫ్రాన్స్ జోడీ 6-3, 6-1తో అమెరికా ద్వయం ఫ్రిట్జ్-తియాఫోపై నెగ్గి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు. గంటా 3 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... బోపన్న ద్వయం అంచనాలకు అనుగుణంగా రాణించింది. 
 
మ్యాచ్ మొత్తంలో బోపన్న-వాసెలిన్ రెండు ఏస్‌లు మాత్రమే సంధించగా, అమెరికన్ జోడీ 4 ఏస్‌లు కొట్టింది. తమ సర్వీస్‌లో 82 శాతం పాయింట్లు సాధించిన బోపన్న-వాసెలిన్ 67 పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో రూబెన్ బిమెల్‌మన్స్ (బెల్జియం) 6-4, 6-4, 6-1తో యూకీపై గెలిచాడు. 
 
అలాగే, పురుషుల సింగిల్స్ తొలిరౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ నాదల్ (స్పెయిన్) 6-4, 6-3, 7-6 (11/9)తో ఇటాలియన్ లక్కీ లూసర్ సైమన్ బొలెల్లీపై గెలిచి రెండోరౌండ్‌లోకి అ డుగుపెట్టాడు.