గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 జులై 2021 (13:18 IST)

రోయింగ్ విభాగంలో సెమీస్‌కు భారత్

టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా, భారత క్రీడాకారులు దూసుకుని పోతున్నారు. తాజాగా రోయింగ్ విభాగంలో సెమీస్‌కు భారత్ చేరుకుంది. లైట్ వెయిటింగ్ డబుల్ స్కల్స్ రెపికేజ్ సెమీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది. రోవర్స్ అర్జున్ లాల్-అర్వింద్ సింగ్ జోడీ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించారు.
 
అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు ఒలింపిక్స్‌లో బోణీ కొట్టారు. గ్రూప్ జె తొలి మ్యాచ్‌లో సింధు శుభారంభం చేశారు. 21-7, 21-10 తేడాతో పీవీ సింధు గెలుపొందారు. ఇజ్రాయిల్ షట్లర్ సెనియా పొలికర్ పోవ్‌పై విజయం సాధించారు.
 
ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన షూటర్లు పూర్తి నిరాశ పరిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎదురుదెబ్బ తగిలింది. మనుబాకర్, యశస్విని ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. మనుబాకర్ 12వ స్థానంలో నిలిచారు. యశస్విని 13వ స్థానంలో తీవ్ర నిరాశకు గురిచేశారు.