శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (10:42 IST)

ఒలింపిక్స్ పతకానికి అడుగు దూరంలో ఆగిపోయిన బాక్సర్

టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు మరో చుక్కెదురైంది. మరో భారత బాక్సర్ ఓడిపోయాడు. పతకానికి అడుగు దూరంలో వచ్చి చిత్తయ్యాడు. 91 కేజీల సూప‌ర్ హెవీ వెయిట్ కేట‌గిరీలో ఆదివారం జ‌రిగిన క్వార్ట‌ర్‌ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇండియ‌న్ బాక్స‌ర్ స‌తీష్‌కుమార్‌.. ఉజ్బెకిస్థాన్ బాక్స‌ర్, వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్‌ జ‌ల‌లోవ్ బ‌ఖోదిర్ చేతిలో 0-5తో ఓడిపోయాడు. 
 
తొలి రౌండ్ నుంచే స‌తీష్‌పై పూర్తిగా పైచేయి సాధించిన జ‌ల‌లోవ్‌ను ఏక‌గ్రీవంగా ఐదుగురు జ‌డ్జీలు విజేత‌గా ప్ర‌క‌టించారు. ప్ర‌తి రౌండ్‌లోనూ జ‌డ్జీలు జ‌ల‌లోవ్ వైపే మొగ్గుచూపారు. ప్ర‌త్య‌ర్థి విసిరిన బ‌ల‌మైన పంచ్‌ల ముందు స‌తీష్ నిల‌వ‌లేకపోయాడు.