సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:22 IST)

ఒస్ట్రావా ఓపెన్‌: సానియా మీర్జా జోడీ అదుర్స్.. సెమీఫైనల్లోకి ఎంట్రీ

ఒస్ట్రావా ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ అదరగొట్టింది. సానియా మీర్జా (భారత్‌)-షుయె జాంగ్‌ (చైనా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

చెక్‌ రిపబ్లిక్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సానియా-షుయె జాంగ్‌ ద్వయం 6-3, 3-6, 10-6తో 'సూపర్‌ టైబ్రేక్‌'లో డానిలినా (కజకిస్తాన్‌)-మరోజవా (బెలారస్‌) జంటను ఓడించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇరీ హోజుమి- నినోమియా (జపాన్‌) జోడీతో సానియా-షుయె జాంగ్‌ ద్వయం తలపడుతుంది.
 
చైనా నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి మరియు యుఎస్ ఓపెన్ ఛాంపియన్ జాంగ్ షుయ్ భాగస్వామి సానియా మీర్జాతో జె & టి బంకా ఆస్ట్రావా ఓపెన్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా ఇటీవలి డబుల్స్ ఫామ్‌ను నిలబెట్టుకుంది.