శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 జులై 2018 (11:10 IST)

ఫిఫా వరల్డ్ కప్ : స్పెయిన్ షూటౌట్.. క్వార్టర్ ఫైనల్లో రష్యా

పేలవ ఆటతో స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఫిఫా ప్రపంచ కప్ పోటీల్లో మరో ఫేవరేట్ జట్టు మట్టికరిచింది. సొంతగడ్డపై అభిమానులు ఉత్సాహపరుస్తుండగా ఆతిథ్య రష్యా అందరినీ ఆశ్యర్యపర

పేలవ ఆటతో స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఫిఫా ప్రపంచ కప్ పోటీల్లో మరో ఫేవరేట్ జట్టు మట్టికరిచింది. సొంతగడ్డపై అభిమానులు ఉత్సాహపరుస్తుండగా ఆతిథ్య రష్యా అందరినీ ఆశ్యర్యపరుస్తూ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది.
 
ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రష్యా పెనాల్టీ షూటౌట్‌లో 4-3తో స్పెయిన్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇగ్నాషెవిచ్ (12వ ని.) ఓన్ గోల్ చేయగా, జ్యూబా (41వ ని.) పెనాల్టీని గోల్‌గా మలిచాడు. 
 
రష్యా దుర్భేద్యమైన రక్షణశ్రేణితో ప్రత్యర్థి జట్టు గోల్‌ ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకుంది. మ్యాచ్‌లో స్పెయిన్‌ 1006 పాస్‌లు ఆడింది. కానీ రష్యా కేవలం 191 పాస్‌లు పూర్తి చేసి మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. 
 
నిజానికి ఒక దశలో ఇరు జట్ల గోల్స్ సమం కావడంతో రెండో అర్థభాగంలో ఇరుజట్లు మరింత మెరుగ్గా ఆడే ప్రయత్నం చేశాయి. సబ్‌స్టిట్యూట్‌లు లేకుండా స్పెయిన్ బరిలోకి దిగితే, రష్యా డీప్ పాస్‌లతో బంతిని ఎక్కువసేపు ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేసింది. 
 
ఈ దశలో హిరెరో వ్యూహం మార్చి ఎదురుదాడికి పురిగొల్పాడు. దీంతో బలమైన రష్యన్ డిఫెన్స్‌పై స్పెయిన్ అటాకింగ్ మొదలుపెట్టినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. స్పెయిన్‌కు ఆఖరులో రెండు అవకాశాలు వచ్చాయి. ఇనెస్టా కొట్టిన సూపర్ స్ట్రయిక్‌ను రష్యా గోలీ అక్నిఫివ్ సమర్థంగా నిలువరించగా, కొద్దిసేపటికే అస్పాస్ రైట్ కార్నర్ నుంచి సంధించిన బలమైన ఫ్రీ కిక్‌ను కూడా అక్నిఫివ్ అడ్డుకున్నాడు. 
 
దీంతో ఎలాంటి గోల్స్ లేకుండా రెండో అర్ధభాగం ముగియడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా సమయానికి దారితీసింది. 30 నిమిషాల ఈ సమయంలో స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ రొడ్రిగో కొట్టిన కార్నర్ డ్రైవ్ షాట్‌ను అక్నిఫివ్ మళ్లీ అడ్డుకున్నా బంతి రీబౌండ్ అయ్యింది.