మంగళవారం, 23 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీరామనవమి
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (09:29 IST)

రాములోరి కల్యాణం.. 8 కేజీల గోటి తలంబ్రాలు సిద్ధం

Rama
శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాచలం రామయ్య కల్యాణ వేడుక పండుగలా జరుగనుంది. సీతారాముల పరిణయ వేడుకలో ఖమ్మం నగరానికి చెందిన అనంత పద్మనాభ కోలాట భక్తబృందం అందించిన 8 కేజీల గోటి తలంబ్రాలను ఉపయోగిస్తారు. 
 
పతకముడి లక్ష్మి సారథ్యంలోని బృందం సభ్యులు తలంబ్రాల కోసం మంగళగూడెంలో ప్రత్యేకంగా వరి పండించారు.  గోటితో ఒలిచిన 8 కిలోల తలంబ్రాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సమర్పించారు. రాములోరి కల్యాణంలో ఈ గోటి తలంబ్రాలను ఉపయోగిస్తారు.