గణేష్ చతుర్థి స్పెషల్ : కోకోనట్ బర్ఫీ
గణేష్ చతుర్థి వచ్చేస్తోంది. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిని నైవేద్యం పెట్టేందుకు పిండి వంటలు ఏవేవి చేయాలో లిస్ట్ వేసుకుంటున్నారా.. ఆ భక్ష్యాల్లో స్వీట్స్ చాలా ముఖ్యమైనవి. మోదక్ అంటే వినాయకుడికి మహా ఇష్టం. అటువంటిదే కొబ్బరి బర్ఫీ. ఆ కొబ్బరి బర్ఫీని ఎలా చేయాలో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు :
కొబ్బరి తురుము: నాలుగు కప్పులు
బాగా కాచి వెన్నతీసేసిన పాలు (కండెన్డ్స్ మిల్క్): ఒక టిన్
యాలకుల పొడి : 2 టీ స్పూన్లు
రోజ్ సిరఫ్ : రెండు టీ స్పూన్లు
నెయ్యి: నాలుగు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం :
ముందుగా డీమ్ బాటమ్ పాన్ పెట్టి వేడయ్యాక కొబ్బరి తురుము వేసి ఐదు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేయాలి. మాడువాసన లేకుండా కలియబెడుతూ ఉండాలి. రోస్ట్ చేసుకొన్న కొబ్బరి తురుమును ఒక ప్లేట్‌లోకి తీసుకుని, డీప్ బాటమ్ పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, తర్వాత ఒక టిన్ కండెన్డ్స్ మిల్క్‌ను అందులో పోసి కాచుకోవాలి.
ఈ పాలలో రోస్ట్ చేసి పెట్టుకొన్న కొబ్బరి తురుము, యాలకుల పొడి మరియు రోజ్ సిరప్ వేయాలి మధ్య మధ్యలో నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. పది నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఒక పెద్ద ప్లేటులో నెయ్యి రాసి అందులో కొబ్బరి బర్ఫీ మిశ్రమాన్ని పోయాలి. వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన షేప్‌లో చాకుతో వాటిని కట్ చేసుకోవాలి. చల్లబడిన తర్వాత కొబ్బరి బర్ఫీలను విడివిడిగా చేసి ఫ్రిజ్‌లో ఒక గంట పాటు ఉంచాలి. అంతే కొబ్బరి బర్ఫీ రెడీ.