శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (13:37 IST)

బియ్యం పాయసం తయారీ విధానం...

కావలసిన పదార్థాలు: బియ్యం - పావు కప్పు పాలు - 2 కప్పులు యాలకులు - 2 కిస్‌మిస్ - 25 గ్రాములు కుంకుమపువ్వు - కొద్దిగా తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని పావుగంట పాటు నానబెట్టుకుని పొడిగా ఆరబెట్టాలి. ఆ

కావలసిన పదార్థాలు:
బియ్యం - పావు కప్పు
పాలు - 2 కప్పులు
యాలకులు - 2 
కిస్‌మిస్ - 25 గ్రాములు
కుంకుమపువ్వు - కొద్దిగా 
చక్కెర - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని పావుగంట పాటు నానబెట్టుకుని పొడిగా ఆరబెట్టాలి. ఆ తరువాత ఈ బియ్యాన్ని మిక్సీలో బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాత్రలో పాలు పోసి అవి కాగిన తరువాత బియ్యపు రవ్వను, యాలకుల పొడిని వేసుకుని రవ్వ మెత్తబడేవరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి. వేడి పాలలో కుంకుమపువ్వును నానబెట్టుకుని పాయసంలో కలుపుకోవాలి. చివరగా చక్కెర వేసుకుని 3 లేదా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే బియ్యం పాయసం రెడీ.