బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (13:22 IST)

మహేశ్వరంలో బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ముందంజ

sabita indra reddy
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. తెలంగాణలోని మహేశ్వరంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మహేశ్వరంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి 3500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేశారు. బీజేపీ తరపున శ్రీరాములు యాదవ్ పోటీ చేశారు. బీఆర్‌ఎస్‌ మంత్రులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు చాలా మంది ఓటమి దిశగా పయనిస్తున్నారు. అయితే సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి మాత్రం తన సత్తా చాటుతున్నారు.
 
కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఖమ్మంతో పాటు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
 
మహేశ్వరంలో కౌంటింగ్ కొనసాగుతుండగా ప్రస్తుతం వీటీఆర్పీ అభ్యర్థి మల్లేష్ పిప్పల కురుమ కంటే బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.