సంబంధిత వార్తలు
- Sreemukhi: బిర్యానీ, ఇంటి స్టైల్ కర్రీలు అంటే ఇష్టం అంటున్న శ్రీముఖి
- ఈ రీబ్రాండింగ్ను గిస్మత్ నుండి జిస్మత్గా మార్చారు: హీరో ధర్మ మహేష్
- Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి
- ఆ యాప్లో కనెక్ట్ అయ్యాడు- హైదరాబాద్లో వైద్యుడిపై లైంగిక దాడి.. బయట చెప్తే?
- బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)
ఫ్రిజ్‌లో బిర్యానీ ప్యాకెట్లు.. ఇప్పుడేమో కేకులో పురుగులు
హైదరాబాదులో ఆహారం కల్తీపై పలు కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఫ్రిజ్‌లో వుంచిన బిర్యానీ ప్యాకెట్లను డెలీవరీ చేసిన ఘటన మరవక ముందే.. మాదాపూర్‌లో కేకులో పురుగులు కనిపించాయి.
మాదాపూర్‌లో ఉన్న బింజ్ అండ్ బాష్ సంస్థను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. ప్రైవేట్ థియేటర్, పుట్టినరోజు వేడుకల కోసం ప్రత్యేక ఆర్డర్లను అందించే ఈ సంస్థ ఇచ్చిన కేకులో పురుగులు వుండటం చూసి కస్టమర్లు షాకయ్యారు. ఆ కేకులో పురుగులు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనికి సంబంధించిన ఒక వీడియోలో, కేకు లోపల పురుగులు కనిపించనప్పటికీ, ఆ కేకులను భద్రపరిచిన రిఫ్రిజిరేటర్ మాత్రం అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. అంతేకాకుండా, అక్కడ అందించే ఫ్రోజెన్ డెజర్ట్స్ ఉంచిన రిఫ్రిజిరేటర్ కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.
