బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2023 (14:47 IST)

అటెండరుతో బూట్లు మోయించిన కలెక్టర్

collector shoe
తెలంగాణా రాష్ట్రంలో ఓ జిల్లా కలెక్టర్ తన బూట్లను అటెండర్‌‌తో మోయించారు. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లా కేంద్రంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు వచ్చినపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. చర్చి ప్రాంగణంలోకి బూట్లతో ప్రవేశించిన కలెక్టర్.. ఆ వెంటనే తన షూలను విప్పి.. పక్కనే ఉన్న అటెండర్ చేతికి అందించారు. ఈ బూట్లను కలెక్టర్ దఫేదార్ వాటిని తీసుకెళ్లి చర్చి బయట వదిలి వచ్చారు. అక్కడ ఉన్నవారంతా ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫోటోలతో పాటు వీడియోలు వైరల్ అయ్యాయి. 
 
గత 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి భవేశ్ మిశ్రా.. ఇటీవలే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన ఉట్నూరులోని సమీకృత గిరిజినాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా పని చేశారు. భద్రాచలం సబ్ కలెక్టరుగా కూడా పని చేశారు కాగా, అటెండరుతో బూట్లు మోయించడంతో నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.