బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 నవంబరు 2024 (21:26 IST)

జగన్‌తో లాభం లేదు.. టీడీపీతో పొత్తు.. బాబుతో కేసీఆర్, కేటీఆర్ భేటీ?

KCR_KTR
KCR_KTR
తెలంగాణలో పట్టుకోసం బీఆర్ఎస్ తీవ్ర యత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్, కేటీఆర్‌లు త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.  తెలంగాణలో పొత్తు కోసం బాబుతో చేతులు కలిపే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 
 
ఏపీలో వైకాపాతో చేతులు కలిపితే చేసేదేమీ లేదని తెలుసుకున్న కేటీఆర్, కేసీఆర్.. టీడీపీతో చేతులు కలిపేందుకు సై అంటున్నట్లు టాక్ వస్తోంది. 
 
తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో బీజేపీ ఎదగకుండా పోతుందని భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి భిన్నమైన లక్ష్యాలు ఉన్నందున బీఆర్‌ఎస్ నేరుగా బీజేపీతో కలిసి పనిచేయడం వారికి ఎప్పటికీ పరపతి ఇవ్వదు.
 
త్వరలో పుంజుకోవాలంటే.. కేసీఆర్, కేటీఆర్‌ల ముందున్న బెస్ట్ ఆప్షన్ తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే. అటు రాష్ట్రంలోనూ, ఇటు కేంద్రంలోనూ తన రాజకీయ జీవితంలో అత్యుత్తమ కాలాన్ని గడుపుతున్న చంద్రబాబు నాయుడు మాత్రమే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను గట్టెక్కించగలరని రాజకీయ నిపుణులు అంటున్నారు.