నాగర్ కర్నూల్ : పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు.. 40 తులాల బంగారుతో జంప్
నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో ఒక పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు. పూజారి ఇంట్లో 40 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. పూజారి శ్రీనివాస్ వర్మ, అతని కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరిగింది. వారు సోమవారం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి వారి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు.
దొంగలు అల్మారాలోని విలువైన వస్తువులను దోచుకుని, 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.6 లక్షల నగదును దోచుకున్నారు. సమాచారం అందిన వెంటనే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను గుర్తించడానికి వేలిముద్రలను సేకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.