గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (13:22 IST)

గాడిదలు కాస్తున్నారా..? లేక గుడ్డి గుర్రాన్ని పళ్ళు తోముతున్నారా?

ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులను కూడా ఆరున్నర ఏళ్లుగా భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ గాడిదలు కాస్తున్నారా లేక.. గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా?'... అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు నిప్పులు చెరిగారు.

కోవిడ్ - 19 విలయతాండవం నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలను భట్టి విక్రమార్క మల్లు సారధ్యంలోని సీఎల్పీ బృందం పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా భట్టి విక్రమార్క బృందం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించింది. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
 
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గత ప్రభుత్వం కట్టిన భవనాలు.. ఇతర మౌలిక సదుపాయాలు తప్ప కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆరేళ్ళల్లో కొత్తగా చేసిందేమీ లేదని అన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది నియమకాలు కూడా ఈ ప్రభుత్వం చేయలేదని అన్నారు.

జిల్లా కేంద్ర ఆసుపత్రి అంటే 350 పడకల ఆస్పత్రిగా ఉండాలి.. కానీ ఇది ఇంకా 100 పడకల ఆస్పత్రుగానే ఉంది. వంద పడకల ఆసుపత్రికి ఉండాల్సిన కనీస సదుపాయాలు కూడా ఇక్కడ లేవని భట్టి విక్రమార్క మల్లు నిప్పులు వివరించారు. కరోనా రోగులను పరీక్షించే సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ అసలు లేవు. ఇక ఎక్స్ రే మిషన్ పని చేయడం లేదని ఆయన మీడియాకు చెప్పారు.

ఇక రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్ల పోస్టులు అన్ని ఖాళీగానే ఉన్నాయని భట్టి చెప్పారు. మొత్తంగా ఇక్కడ 49 డాక్టర్ల పోస్టులు మంజూరు అయితే 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయని భట్టి చెప్పారు.
 
దేవుళ్ళు లేని డేవాలయలుగా ఆసుపత్రులు
వైద్యో నారాయణో హరి అంటాము.. వైద్యుడు దేవుడితో సమానం. ఇప్పుడున్న కరోనా సమయంలో వైద్యులు కళ్ళముందు నడిచే దేవుళ్ళు.. ఆసుపత్రులు దేవాలయాలు అన్నారు. అయితే కేసీఆర్ సర్కార్ డాక్టర్ల పోస్టులు భర్తీ చేయకుండా ఆసుపత్రులను దేవుళ్ళు లేను దేవాలయాలుగా మార్చారని మండిపడ్డారు. వైద్యులు లేని ఈ ఆసుపత్రికి వచ్చే పేదలకు ఎటువంటి వైద్య సహాయం అందుతుందని అన్నారు. 
 
ఐసోలేషన్ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వం కరోనను కట్టడి చేసేందుకు పేద ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఐసోలేషన్ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భట్టి డిమాండ్ చేశారు. హోమ్ క్వారయింటైన్ వల్ల గ్రామాల్లో కరోనా పెరుగుతోందని అన్నారు.
 
నీళ్లు లేవు.. నియామకాలు లేవు
నీళ్ళు కోసమే తెలంగాణ, ఉద్యోగాల కోసమే ఉద్యమం అని చెప్పిన కేసీఆర్, ఈటల రాజేందర్ ఆరున్నర ఏళ్లుగా గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నట్లుగా.. లేదంటే గాడిదలు కాస్తున్నగా ఉందని భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలో కొత్త నీళ్ల సంగతి దేవుదేరుగు ఉన్న నీళ్లు కూడా పోయే పరిస్థితి వెచ్చిందని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల దక్షిణ తెలంగాణ పూర్తిగా నష్టపోతుందని అన్నారు.

రోజుకు 3 టీఎంసీల చొప్పున ఏపీ తీసుకుపోతుందని అన్నారు. అలాగే 43 వేల క్యూ సెక్కుల నుంచి 80 వేల క్యూ సెక్కుల సామర్థ్యం పెంపుదల కారణంగా.. దాదాపు 11 టీఎంసీల నీళ్లు ఏపీకి పోతాయని భట్టి చెప్పారు.

ఎపిక్స్ కమిటీ సమావేశాలకు వెళ్లకుండా రాయలసీమ లిఫ్ట్ టెండర్ల ఖరారుకు కేసీఆర్ సహకరించారని భట్టి అన్నారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి అయితే తెలంగాణలో మొత్తం 27 లక్షల ఎకరాల ఎండిపోతాయని అన్నారు. కేసీఆర్ దుర్మార్గ పాలనకు ఇది నిదర్శనం అన్నారు.