మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:33 IST)

రైతుల‌ను ఆదుకోండి: సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క

క‌రోనాపై గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క దృష్టికి ప్ర‌జ‌లు ప‌లు స‌మ‌స్య‌లు తీసుకువ‌స్తున్నారు.

తాజాగా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం ముదిగొండ మండ‌లం మేడిల్లిలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌ను ప‌లువురు రైతులు కల‌సి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.

ప్ర‌ధానంగా కొనుగోలు కేంద్రం వ‌ద్ద లారీలు లేక‌పోవ‌డంతో ధ్యాన్యం అక్క‌డి ఉండిపోయింద‌ని, వ‌ర్షం వ‌స్తే తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని వారు భ‌ట్టికి వివ‌రించారు.

దీనిపై స్పందించిన ఆయ‌న ధాన్యం త‌ర‌లించేందుకు వెంట‌నే లారీల‌ను ఏర్పాటు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు.