గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (13:50 IST)

భట్టి విక్రమార్కకు కరోనా: స్వల్ప అస్వస్థతతో అడ్మిట్

కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క కరోనా బారిన పడ్డారు. కరోనా సోకడంతో స్వల్ప అస్వస్థతకు గురై భట్టి విక్రమార్క ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అపోలో ఆసుపత్రి వైద్యులు భట్టి విక్రమార్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 
 
ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వయంగా భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.