శతాధిక వృద్ధుడు ఈటల మల్లయ్య మృతి
మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నేత ఈటల రాజేందర్ తండ్రి, శతాధిక వృద్ధుడు ఈటల మల్లయ్య కన్నుమూశారు. ఈయన వయసు 104 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఆర్వీఎం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు.
ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా కమలాపూర్‌లోని స్వగృహానికి తరలించనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఈటల మల్లయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి.