బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (16:32 IST)

కల్నల్‌ సంతోష్‌కుమార్‌కు కాంస్య విగ్రహం..ఎక్కడో తెలుసా?

లఢక్‌ ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌కుమార్‌ కు సూర్యాపేటలోని ఓ కూడలిలో కల్నల్‌ సంతోష్‌కుమార్‌ కాంస్యవిగ్రహం ఏర్పాటుచేస్తామని తెలంగాణా మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు.

సంతోష్‌కుమార్‌ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. సూర్యాపేట కేసారంలోని సంతోష్‌ వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర సాగింది. ప్రజలందరూ సంతోష్‌కుమార్‌ మృతదేహంపై పూలు జల్లుతూ శ్రద్ధాంజలి ఘటించారు.

దహన సంస్కారాలు ముగిసిన అనంతరం తెలంగాణా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరంలోని ఓ సర్కిల్‌కు సంతోష్‌కుమార్‌ పేరు పెడతామన్నారు.

అంత్యక్రియలు జరిగిన చోట సంతోషకుమార్‌ స్మారక స్థూపం నిర్మిస్తామని చెప్పారు. సంతోష్‌కుమార్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయన సతీమణికి ఉద్యోగం ఇస్తానని ఇప్పటికే సిఎం కేసిఆర్‌ హామీ ఇచ్చారని చెప్పారు.