శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (11:04 IST)

యాచారాంలో చిరుతపులి కలకలం...

రంగారెడ్డి జిల్లా యాచారంలో చిరుతపులి సంచరిస్తున్నట్టు కలకలం రేగింది. మండలంలోని పిల్లిపల్లి శివారు ప్రాంతంలో ఉన్న పొలంలో ఆవుదూడను చంపి ఆరగించింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 
 
వారం రోజుల క్రితం మండలంలోని నానక్ నగర్‌లో చిరుతపులి సంపరించింది. ఈ నెల 8వ తేదీన మేకల మందపై దాడిచేసి ఓ మేకను చంపేసింది. అలాగే, గత యేడాది నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజ్జిలాపురంలో అడవిపందుల కోసం అమర్చిన ఉచ్చులో ఓ చిరుతపులి చిక్కుకుంది. దీన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకుని జూకు తరలించారు. ఇపుడు యాచారాంలో మరో చిరుత పులి సంచారం కలకలం రేపింది.