మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (07:24 IST)

ఇంత చిన్న వయసులోనే తల్లి అయ్యవా?:సీతక్క

ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఎంతో విలక్షణమైన నేత. రాజకీయ నేత అయినప్పటికీ ఎంతో నిరాడంబరంగా ఉంటారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు ఇష్టపడతారు.
 
తాజాగా సీతక్క తన నియోజకవర్గంలోని ఓ మారుమూల తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి పాఠశాలలో చిన్నారులకు తినుబండారాలు, ఆట వస్తువులు అందించారు.
 
ఇక, అక్కడే ఓ బాలిక చంకలో పసిబిడ్డను ఎత్తుకుని కనిపించడంతో సీతక్క ఆశ్చర్యపోయారు. ఆ బాలికను ఎంత వయసు అని అడిగారు.
 
ఆ అమ్మాయి 14 ఏళ్లు అని చెప్పడంతో 'ఇంత చిన్నవయసులోనే తల్లయ్యావా? ఆరోగ్యం ఎలా ఉంటోంది? నువ్వు బాగా చదువుకుని ఉండుంటే ఇక్కడి స్కూల్లో నిన్నే టీచర్ గా నియమించేదాన్ని కదా చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసుకోవద్దు' అంటూ హితబోధ చేశారు.