శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (20:41 IST)

సిద్ధిపేటలో కాల్పుల కలకలం: భూ వివాదమే కారణమా..?

తెలంగాణలోని సిద్ధిపేటలో కాల్పుల కలకలం రేగింది. భూ వివాద విషయంలోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట్ - జప్తిలింగారెడ్డిపల్లి శివారులో.. దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు తిరుపతికి సంబంధించిన వ్యక్తులు వంశీకృష్ణ అనే వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. 
 
కాగా.. వంశీకృష్ణ గతంలో ఒగ్గు తిరుపతిపై కత్తితో దాడి చేయగా.. ఇప్పుడు తిరుపతి అతనిపై కాల్పులు జరిపించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.