శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2022 (17:35 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త - సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్

train
శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంంచుకుని సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు ప్రకటించింది. మొత్తం నాలుగు స్పెషల్ సర్వీసులు నడుపనున్నట్టు తెలిపింది. 
 
ఈ రైళ్ళు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6.20 గంటలకు ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
 
అలాగే, ఆగస్టు 16న సాయంత్రం 05.15 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07412) తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.25 గం.లకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. 
 
ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేరం, కృష్ణ, రాయ్‌చూర్, మంత్రాలయం రోడ్, ఆధోని, గుంతకల్, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయని పేర్కొన్నారు. 
 
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య విజయవాడ మీదుగా రెండు సర్వీసుల ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలియజేసింది.
 
ఆగస్టు 17 సాయంత్రం 06.40 గం.లకు ప్రత్యేక రైలు (07473) సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.45 గం.లకు తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు. 
 
ఆగస్టు 18వ తేదీన సాయంత్రం 05.00 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07474) తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.45 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు.