మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 మార్చి 2021 (12:04 IST)

డంబెల్స్ పైకెత్తాడు, అంతే... మృత్యువు అతడిని కబళించింది

ఆరోగ్యం కోసం డంబెల్స్ పైకెత్తుతూ వ్యాయామం చేస్తున్న అతడిని ఆ డంబెల్స్ రూపంలో మృత్యువు కబళించింది. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
 
వివరాల్లోకి వెళితే.. యాచారం పరిధిలోని నక్కర్తమేడిపల్ల గ్రామంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల ఫిరోజ్ స్థానికంగా ఎస్ఆర్ హేచరీస్‌లో పని చేస్తున్నాడు. రోజూ ఉదయం వేళ అతడికి వ్యాయామం చేసే అలవాటు వుంది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం డంబెల్స్ తో వ్యాయామం చేస్తున్నాడు.
 
ఐతే ప్రమాదవశాత్తూ అతడు పైకి లేపిన డంబెల్స్ అతడిపై పడ్డాయి. దాంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.