మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 20 అక్టోబరు 2018 (14:19 IST)

భర్తతో అసంతృప్తి... అల్లుడితో మేనత్త అక్రమ సంబంధం... ఆ తరువాత?

వావి వరసలు మరిచాడు. మేనత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అదే అతని ప్రాణాలు బలితీసుకుంది. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పాతబస్తీలోని సబ్జీమండీకి చెందిన జావెద్ కారు పెయింటర్‌గా పనిచేస్తుండేవారు. మదీనా నగర్‌లో నివాసముండే తన మేనమామకు ఇద్దరు భార్యలు.
 
భర్త సరిగ్గా పట్టించుకోవడంతో మేనల్లుడు జావెద్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది మేనత్త. నాలుగేళ్లుగా వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతూ ఉండేది. జావెద్ మేనత్తకు ఖతర్‌లోని ఉద్యోగం రావడంతో అక్కడకు వెళ్ళింది. ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బును జావెద్‌కు పంపించేది మేనత్త. 
 
విషయం కాస్తా కుమారులకు తెలిసింది. తమ తల్లితో వివాహేతర సంబంధం వదులుకోవాలని జావెద్‌ను పలుమార్లు హెచ్చరించారు బావమరుదులు సుహేష్, సులేమాన్‌లు. వాళ్లు ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోలేదు జావెద్. ఎలాగైనా జావెద్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నారు ఆమె కుమారులు. తమ మరో స్నేహితుడి సహాయంతో ముగ్గురు మదీనా నగర్ లోని తమ ఇంటిలో కూర్చుని జావెద్‌కు ఫోన్ చేసి పిలిపించారు. 
 
కావాలనే జావెద్‌తో గొడవ పెట్టుకున్నారు. వారితో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వస్తున్న జావెద్ పైన కత్తులతో దాడికి దిగారు. వేట కత్తులతో అతి దారుణంగా నరికి చంపేసి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.