శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: గురువారం, 28 జనవరి 2021 (22:05 IST)

వారణాసిలో కేసీఆర్ కుటుంబం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు

కేసీఆర్ శ్రీమతి శోభ, ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా వారణాసిలో పర్యటిస్తున్నారు అక్కడ పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు.
 
 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం వారణాసికి వెళ్లింది. రెండు రోజుల పాటు అక్కడే కుటుంబ సభ్యులు పర్యటించనున్నారు. సీఎం సతీమణి శ్రీమతి శోభ, కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఇతర కుటుంబ సభ్యులు వారణాసిలో పర్యటిస్తున్నారు.
 
ఇవాళ రేపు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటిస్తారు. తొలుత అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బొట్లో ప్రయాణం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్ లో గంగా హారతి, గంగా పూజలు నిర్వహించనున్నారు. అస్సి ఘాట్ కు బోట్లో‌ తిరుగు‌ ప్రయాణం అవుతారు. సంకత్మోచన్ దేవాలయాన్ని దర్శిస్తారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవుడికి పట్టు వస్త్రాల‌ కూడా సమర్పించనున్నారు.
 
కేసీఆర్ కుటుంబ సభ్యుల వారణాసి పర్యటన ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేటీఆర్ సీఎం అవుతారన్న వార్తల నేపథ్యంలో సీఎం కుటుంబం వారణాసి పర్యటన మరింత హాట్ టాపిక్ అయ్యింది. అక్కడ పలు ఆలయాల్ని దర్శించడంపై కూడా రాజకీయ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు