1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (22:47 IST)

మృత్యువుతో 5 రోజులుగా పోరాడి కన్నుమూసిన మెడికో ప్రీతి

medico preethi
వరంగల్‌ కాకతీయ వైద్య కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి రాత్రి 9 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. అంతకుముందు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. ప్రీతి మృతిపై నిమ్స్ వైద్యులు ప్రకటన చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.
 
అంతకుముందు ప్రీతిని చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమేనని తెలిపారు. ఆమె ఆరోగ్యం అంతకంతకూ విషమంగానే వుందని ప్రకటించారు కూడా. ప్రీతి ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఆమె మృతికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 
 
కాగా, తన సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేని ప్రీతి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం తెల్సిందే. సైఫ్‌తో పాటు మరికొందరు సీనియర్ విద్యార్థులు చేసిన ర్యాగింగ్ కారణంగా వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె గత ఐదు రోజులుగా నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి ఆమె కన్నుమూసింది.