శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: గురువారం, 30 జులై 2020 (17:20 IST)

కోవిడ్ రెస్పాన్స్ ఆంబులెన్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

కరోనా విజృంభిస్తున్న వేళ కోవిడ్ రెస్పాన్స్ ఆంబులెన్స్ ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ప్రగతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాక మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ జెండా ఊపి ఆంబులెన్స్‌ను ప్రారంభించారు. కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వానికి 6 ఆంబులెన్సులను అందిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.
 
మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ సతీమణి శైలిమ, కుమార్తె అలేఖ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పూర్తితో పలువురు ఆంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలో వాటినన్నింటిని కూడా ప్రారంభిస్తామని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్‌కు తెలిపారు.