ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (19:26 IST)

క్రికెట్ బెట్టింగ్.. రూ.40 లక్షలు నష్టం.. టెక్కీ ఆత్మహత్య

suicide
సాంకేతికత పెరగడం ఒకందుకు మంచిదే. కానీ చాలా మేరకు నష్టాలు తప్పట్లేదు. మానవునికి పెరిగిన టెక్నాలజీ కష్టాల్నే తెచ్చిపెడుతున్నాయి. అంతేగాదు.. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. త్వరగా డబ్బులు సంపాదించాలనే అత్యుత్సాహంతో చదువుకున్న వారు కూడా చేతులు కాల్చుకుంటున్నారు. 
 
దీని వల్ల అప్పులు పాలై.. పరువును నడి బజారుకు లాక్కుంటున్నారు. ఆ తర్వాత ఆత్మహత్యే శరణ్యమని బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. 
 
తాజాగా క్రికెట్‌లో బెట్టింగ్ కట్టి.. 40 లక్షలు నష్టపోయి.. చివరకు రైలు పట్టాలపై తనువు చాలించాడు ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన గంగి రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అప్పు చేసి మరీ బెట్టింగ్స్ వేశాడు. 
 
దీంతో అప్పులు ఇచ్చిన వారు అడగటం మొదలు పెట్టేసరికి.. ఏం చేయాలో తోచక.. భార్యను, పసి బిడ్డను వదిలేసి.. జిల్లాలోని సాతలూరు రైలు పట్టాలపై ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.