గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (18:22 IST)

హైదరాబాద్ నగరంలో కండలు పెంచే డేంజర్ ఇంజెక్షన్...

హైదరాబాద్ నగరంలో కండలు పెరిగేందుకు ఉపయోగించే ఓ ప్రమాదకర ఇంజెక్షన్స్ చెలామణిలో ఉన్నాయి. వీటిని కండలు పెంచేందుకు ఉపయోగిస్తున్నారు. బాడీని బంతిలా తిప్పేయాలన్న మోజులో హైదరాబాద్ నగర యువత జిమ్‌లో స్టెరాయిడ్స్ ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున కండరాలు పెంచాలనే తపనతో వారు ఈ తరహా స్టెరాయిడ్స్‌ను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
 
హైదరాబాద్ నగరంలోని రాచకొండ పరిధిలోని హిమయత్ నగర్ పీఎస్‌లో డేంజర్ ఇంజక్షన్స్ విక్రయించే మెడికల్ మాఫియాను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్‌గా ఉపయోగించే అనేస్తటిక్, హార్మోన్స్ ఇంజెక్షన్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు హయత్ నగర్‌లోని శ్రీనివాస ఆస్పత్రి కాంపౌడర్ బాలాజీ ధర్మాజీ, మ్యాక్సిక్యూలర్ ఆస్పత్రి సిబ్బంది ప్రసాద్ గులాబ్ రావ్‌ని పక్కా సమచారంరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వీరివద్ద నుంచి 30 స్టెరాయిడ్స్‌ ఇంజెక్షన్లను, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్‌కి చెందిన వీళ్లిద్దరూ గత కొన్నేళ్లుగా ఎల్బీ నగర్, హయత్ నగర్ సహా ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు.