1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జులై 2022 (12:40 IST)

తెలంగాణాలో భారీ వర్షాలు - అనేక రైళ్లను రద్దుచేసిన ద.మ.రైల్వే

trains
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అనేక రైళ్లను రద్దు చేసింది. వీటిలో ప్యాసింజర్ రైళ్లతో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. 14వ తేదీ గురువారం నుంచి ఈ నెల 17న తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 
 
రద్దు చేసిన రైళ్ళలో సికింద్రాబాద్ - ఉందానగర్ - సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్ - ఉందా నగర్ మెము, ఉందా నగర్ - సికింద్రాబాద్ మెము, సికింద్రాబాద్ - ఉందా నగర్ స్పెషల్ మెము, మేడ్చల్ - ఉందానగర్ మెము, ఉందానగర్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - ఉందా నగర్ స్పెషల్ మెము రైళ్లతో పాటు హెచ్ ఎస్ నాదేండ్ - మేడ్చల్ - హెచ్ ఎస్ నాందేడ్, సికింద్రాబాద్ - మేడ్చల్ మెము, మేడ్చల్ - సికింద్రాబాద్ మెమెు రైలు, కాకినాడ పోర్టు - విశాఖపట్టణం మెము, విజయవాడ - బిట్రగుంట మెను రైలును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
అాలగే, హైదారాబాద్, సికింద్రాబాద్‌ల మధ్య నడిచే 34 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇవి కూడా గురువారం నుంచి 17వ తేదీ వరకు అందుబాటులో ఉండవు. 
 
వీటిలో లింగంపల్లి - హైదరాబాద్ 9 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా - లింగంపల్లి  మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లి మార్గంలో 9, లింగంపల్లి - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - లింగంపల్లి మార్గంలో ఒక్కొక్క రైలును రద్దు చేశారు.