మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మే 2021 (11:41 IST)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో వైద్య విభాగంలో ఖాళీల భర్తీ

తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య విభాగంలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ఆసుపత్రుల్లో మొత్తం 74 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
 
కాకతీయ మెడికల్ కాలేజీ కి అనుబంధంగా ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ లో కొన్ని ఖాళీలు ఉండగా ఆదిలాబాద్ లోని రిమ్స్ లో మరి కొన్ని ఖాళీలు వున్నాయి. ఈ మేరకు కాకతీయ మెడికల్ కాలేజీ , రాజీవ్ గాంధీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫేసర్ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేశాయి.
 
కేఎంసీ, వరంగల్ లో చేరడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 26న ఉదయం 11.30 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1. 25 లక్షల చొప్పున వేతనం ఇవ్వనున్నారు.
 
ఇది ఇలా ఉండగా ఆదిలాబాద్ రిమ్స్ లో చేరడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 27న గురువారం ఉదయం 10. 30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఆన్లైన్ ఇంటర్వ్యూలకు హాజరు అవ్వాలని అధికారులు తెలియ జేయడం జరిగింది.