శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (08:38 IST)

హైదరాబాదులో రెస్టారెంట్లు, కేఫ్‌లు, దుకాణాలు 24x7 తెరిచే వుంటాయ్

charminar
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుకాణాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు 24x7 పని చేయడానికి అనుమతిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా షాపుల ముగింపు గంటల నియమాలను సవరించింది. ఈ ప్రగతిశీల చర్య ద్వారా హైదరాబాద్‌ ముంబై వంటి నగరాల సరసన నిలుస్తుంది. 
 
లేబర్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, తెలంగాణ షాప్స్ - ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988లోని సెక్షన్ 2 (21)లో నిర్వచించబడిన అన్ని దుకాణాలు, స్థాపనలు అదే చట్టంలోని సెక్షన్ 7 నుండి మినహాయించబడ్డాయి. మార్గదర్శకాలు అటువంటి సంస్థలలోని ఉద్యోగుల సంక్షేమాన్ని నిర్ధారిస్తాయి.