శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (17:12 IST)

తెలంగాణ మంత్రికి చుక్కలు చూపించిన లిఫ్టు...

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉండే మంత్రి కొప్పుల ఈశ్వర్ లిప్టులో ఇరుక్కునిపోయారు. దీంతో ఆయన సహాయక సిబ్బంది తీవ్ర టెన్షన్‌కు గురయ్యారు. 
 
శుక్రవారం సైఫాబాద్‌లోని సామ్రాట్ అపార్ట్‌మెంట్స్‌లో బుడగ జంగాలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం లిఫ్టులో కిందికి వస్తుండగా అది సాంకేతిక కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది.
 
తిరిగి రీస్టార్ట్ చేసినా పైకి, కిందికీ తిరిగిందే తప్ప ఆ లిఫ్టు గ్రిల్స్ తెరుచుకోలేదు. మంత్రి లిఫ్టులో చిక్కుకుపోవడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. దాదాపు అరగంట సేపు తీవ్రంగా శ్రమించిన అనంతరం ఆయనను సిబ్బంది సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. 
 
ఎట్టకేలకు లాక్ తెరుచుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఆ లిఫ్టు చాలా పాతది కావడం, మంత్రిపాటు అనేకమంది ఎక్కడంతో ఓవర్ లోడ్ కారణంగా నిలిచిపోయినట్టు భావిస్తున్నారు.