శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 జులై 2021 (17:04 IST)

తెలంగాణలో భారీ వర్షాలు... మరో రెండు రోజులు..?

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. 
 
తెలంగాణలోనూ శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని తెలిపింది. పశ్చిమ భారతదేశం నుంచి తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.