కాంగ్రెస్‌లో చేరనున్నటీఆర్ఎస్ నేత, చెరుకు శ్రీనివాస్ రెడ్డి
టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రంస్ పార్టీలో చేరనున్నారు. తండ్రి ముత్యం రెడ్డితో కలిసి 2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌లో చేరిన శ్రీనివాస్ రెడ్డి కొన్నాళ్లుగా ఆ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు.
దుబ్బాక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని టీపీసీసీ శ్రీనివాస్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్‌లో చేరారు.
ముత్యం రెడ్డికి రాష్ట్రస్థాయి కార్పోరేషన్ పదవి ఇస్తామని కేసీఆర్ ఆ సమయంలో హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎన్నికల అనంతరం ముత్యం రెడ్డి అనారోగ్యంతో కన్ను మూసారు. అప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డిని పెద్దగా టీఆర్ఎస్ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా దూరంగా పెడుతున్నారని ఆయన వర్గంలో అసంతృప్తి ఉంది.