తెరాస ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనావైరస్ మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. క్రమంగా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనబడుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోహీరోయిన్లుతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా సోకుతోంది. తెరాసకి చెందిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్థారణ అయ్యింది.
ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్వయంగా చెపుతూ.. తనను కలిసిన వాళ్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. పలు కార్యక్రమాల్లో భాగంగా పలువురు తెరాస నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. వారంతా కూడా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేసారు.