1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (15:46 IST)

తెలంగాణ పాలిసెట్ -2023 నోటిఫికేషన్..

Online Exams
తెలంగాణ పాలిసెట్ -2023 నోటిఫికేషన్ విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో జ‌న‌వ‌రి 16 నుంచి ఏప్రిల్‌ 24 వరకు అలాంటి ఆలస్య రుసం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
పదో తరగతి పాసైన విద్యార్థులతో పాటు ఈ ఏడాది పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పాలీసెట్ 2023 పరీక్ష మే 17న నిర్వహిస్తామని కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ చెప్పారు. 
 
పాలీసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమా సీట్లను భర్తీ చేస్తారు.