బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (10:15 IST)

20 వేల కేంద్రాలలో వ్యాక్సినేషన్: కిషన్‌రెడ్డి

కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎవరూ భయపడవద్దని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో కిషన్‌రెడ్డి వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  రెండవ దశ వ్యాక్సినేషన్ నిన్న ప్రారంభం  అయ్యిందని...నిన్న ప్రధాని కూడా తీసుకున్నారని తెలిపారు.

60 ఏళ్ళు పైబడిన వారు, 45 ఏళ్ల పైబడిన దీర్ఘకాలిక వ్యాధుల వారికి వ్యాక్సిన్ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ఉంటుందని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

ప్రభుత్వ సెంటర్స్‌లో ఉచితంగా వ్యాక్సిన్ వేసుకోవచ్చని, ప్రైవేట్‌లో డోస్ రూ.250 ఉంటుందన్నారు. 250 రూపాయిలు మించి ఇవ్వవద్దని స్పష్టం చేశారు. రూ.250 మించి హాస్పిటల్స్ కూడా తీసుకోకూడదని ఆయన ఆదేశించారు.
 
దేశ వ్యాప్తంగా 10 వేల కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రారంభమైందని తెలిపారు. ప్రభుత్వ కేంద్రాలను 20 వేలకు పెంచుతామన్నారు.  రాష్ట్రంలో 91 కేంద్రాలలో వ్యాక్సిన్ ప్రారంభించామని చెప్పారు. మంత్రి ఈటల కూడా వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు.

కోవిడ్  వ్యాక్సిన్ ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ రోజే మొదటి కేస్ నమోదైందని తెలిపారు. గాంధీ టీం సంవత్సరం నుంచి నుంచి చాలా కష్టపడిందంటూ...గాంధీ టీంకు సెల్యూట్ చేశారు. ‘‘మీ పని ఫలితాలు కనిపిస్తున్నాయి’’ అంటూ కిషన్‌రెడ్డి కొనియాడారు.