శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (14:52 IST)

ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళపై వార్డ్‌బాయ్‌ అత్యాచారం

rape
దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళపై వార్డ్‌బాయ్‌ అత్యాచారం చేసిన ఘటన మలక్‌పేట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేటకు చెందిన మహిళ(40) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హౌస్‌ కీపింగ్‌ విభాగంలో పనిచేస్తోంది. 
 
జియాగూడకు చెందిన సందీప్‌(25) అక్కడే వార్డ్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి రెండో అంతస్తులో పని ఉందని ఆమెకు చెప్పాడు. అక్కడ శుభ్రం చేస్తుండగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.