సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (16:14 IST)

మద్యం బాబులకు దుర్వార్త - మద్యం షాపులు బంద్

liquor bottles
హైదరాబాద్ నగరంలోని మద్యం బాబులకు ఇది నిజంగానే దుర్వార్త. వారాంతపు రోజైన శనివారం జంట నగరాల్లో మద్యం షాపులను మూసివేయనున్నారు. దీనికి కారణం హనుమాన్ శోభాయాత్ర. 
 
ప్రతి యేడాది తరహాలోనే ఈ యేడాది కూడా హనుమాన్ శోభాయాత్రకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతుంది. శనివారం హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బంద్ హనుమాన్ ఆలయం వరకు ఈ శోభాయాత్ర సాగనుంది.
 
ఈ యాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు ఆంక్షలు విధించారు. 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటలకు నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు విధిగా మూసివేయాలని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రా ఆదేశించారు.