గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (11:50 IST)

సొట్ట బుగ్గల సుందరి లైలా సెకండ్ ఇన్నింగ్స్: కార్తీ సినిమాల్ ఛాన్స్!

సొట్ట బుగ్గల సుందరి లైలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా వుంది. తెలుగులో ఎగిరే పావురమా చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. 
 
ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్‌లోను అమ్మడు మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్, సూర్య నటించిన శివపుత్రుడులో లైలా నటన ఇప్పటికీ ఎక్కడో ఒక చోట నవ్వులు పూయిస్తుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఒక బిజినెస్ మ్యాన్ ని వివాహమాడి సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ భామ ప్రస్తుతం రీ ఎంట్రీ అవకాశాల కోసం ఎదురుచుస్తున్నదట.
 
ఈ  నేపథ్యంలో కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న సర్దార్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిందట. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ రెండు విభిన్నమైన గెటప్పులో కనిపించనున్నాడు. 
 
ఈ చిత్రంలో లైలా ఒక కీలక పాత్రలో నటిస్తుందని, ఈ సినిమాతో అమ్మడికి మంచి పేరు వస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.