బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (13:09 IST)

బెర్లిన్‌కు బయల్దేరిన పుష్ప నటుడు అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?

Allu Arjun Pushpa 2
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2: ది రూల్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి కనిపించనున్నారు. ఆగష్టు 15, 2024న ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో విడుదల కానుంది. రష్మిక మందన్న కథానాయిక.
 
ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి బెర్లిన్‌కు బయలుదేరాడు పుష్ప నటుడు అల్లు అర్జున్. గురువారం ఉదయం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు.
 
కాగా, సెట్స్‌పై ఇతర నటీనటులతో పుష్ప-2 షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.