శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 22 అక్టోబరు 2018 (13:54 IST)

ప్రకాష్‌ రాజ్‌ను చూస్తే నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది... అనుపమ పరమేశ్వరన్

హలో గురూ ప్రేమ కోసం సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే సినిమా కన్నా సినిమాలోని ఇద్దరు వ్యక్తుల గురించి తెలుగు సినీ పరిశ్రమలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. వారెవరో కాదు విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందని, షూటింగ్ నుంచి వెళ్ళిపోయిన అనుపమ మరుసటి రోజు షూటింగ్‌కు హాజరు కాలేదంట.
 
ఇందుకు ప్రకాష్‌రాజ్, అనుపమ పరమేశ్వరన్‌ల మధ్య చిత్రీకరిస్తున్న కొన్ని సీన్లలో వారిద్దరికి వాగ్వాదం జరగడమే కారణమట. ఒక సీనియర్ నటుడని కూడా చూడకుండా ప్రకాష్‌ రాజ్‌ను అనుపమ ఇష్టమొచ్చిన విధంగా మాట్లాడినట్లు సినీ పరిశ్రమలో చర్చ జరిగింది. అయితే అనుపమ మాత్రం అదంతా అబద్థమని చెబుతోంది. 
 
శతమానం భవతి సినిమాలో ప్రకాష్‌ రాజ్ తనకు తాతగా నటించాడని, ఆ తరువాత హలో గురూ ప్రేమ కోసం సినిమాలో తండ్రిగా నటించాడని, మా ఇద్దరి మధ్య తండ్రీకూతుళ్ళ సంబంధం ఉందని చెబుతోంది అనుపమ. ప్రకాష్‌ రాజ్‌ను చూస్తే నాకు నా తండ్రిని చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. నేనెందుకు ఆయన్ను అపార్థం చేసుకుంటాను. కొంతమంది అలా మాపై దుష్ర్పచారం చేశారంటోంది అనుపమ పరమేశ్వరన్.