మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (19:43 IST)

"సోగ్గాడే చిన్నినాయన'' సీక్వెల్‌లో సోనాక్షి సిన్హా..

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించనుంది. తద్వారా ఆమె టాలీవుడ్‌కి పరిచయం కాబోతోంది. "సోగ్గాడే చిన్నినాయన'' సీక్వెల్‌లో ఆమెను తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నాగ్‌కి జోడీగా కొత్తగా ఉంటుందని ఆలోచనట. ఆమెతో చర్చలు కూడా జరుపుతున్నారట. 
 
2015 సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సంచలనం విజయం సాధించింది. ఇందులో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రకు అద్భుతమైన స్పందన లభించింది. అందుకే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఆ సినిమాకు సీక్వెల్ తీస్తామని చెప్పారు. అదే పనిలో ఉన్నారు. 
sonakshi sinha
 
టైటిల్ కూడా 'బంగార్రాజు' అని కన్ఫామ్ చేశారు. అదిగో ఇదిగో అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఈ సంవత్సరం పట్టాలెక్కుతుందని ప్రకటించాడు నాగార్జున. ప్రీప్రొడక్షన్ కూడా మొదలైంది. ఇందులో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను ఓ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట. నిజానికి ఈ సినిమా షూటింగ్ జూన్, జూలైలో మొదలెట్టాలనుకున్నారు. ఇప్పుడు కరోనా వేవ్‌తో ఎప్పటి నుంచి ఆరంభమవుతుంతో తెలియట్లేదు.