శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 2 జనవరి 2021 (16:54 IST)

తండ్రి ఇచ్చిన మాట కోసం గంగవ్వకు 18 లక్షలు నాగచైతన్య ఇచ్చారా?

బిగ్ బాస్ 4వ సీజన్ కాస్త పెద్ద చర్చే. ఇందులో నటించిన వారికి మంచి అవకాశాలే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ షో నుంచి బయటకు వచ్చిన గంగవ్వకు ప్రస్తుతం అవకాశాలు లేవు గానీ.. వయసు పైబడిన ఆమెకు సొంతంగా ఇంటిని నిర్మించుకోవడానికి మాత్రం అవకాశం లభించింది.
 
అది కూడా బిగ్ బాస్ ద్వారానే సాధ్యమైంది. సాక్షాత్తు కింగ్ నాగార్జున వేదికపై ఈ విషయాన్ని తెలిపాడు. అనారోగ్యంతో హౌస్‌ను వదిలి గంగవ్వ వెళ్ళిపోతున్నారు. కానీ ఆమె తాను బిగ్ బాస్ విజేతగా నిలుస్తానని ముందు నుంచి చెబుతున్నారు. కానీ ఆమెకు ఆరోగ్యం సహకరించడం లేదు.
 
ఆమె హౌస్‌లో ఉండలేకపోయారు. కాబట్టి ఆమెకు సహాయం చేయాలని అనుకుంటున్నా. ఆమెకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను నేనే తీసుకుంటా అంటూ చెప్పాడట నాగార్జున. దీంతో అప్పట్లో తన స్థలంలోనే ఇంటి నిర్మాణానికి సంబంధించి పనులన్నీ చేసేసుకుందట గంగవ్వ. మొదట్లో తన సొంత డబ్బులతో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తే గత వారంరోజుల వరకు బిగ్ బాస్ నుంచి ఎలాంటి డబ్బులు గంగవ్వకు అందలేదట.
 
షో ముగిసింది.. ఇక డబ్బులు ఎందుకు ఇస్తారనుకుంటున్న సమయంలో తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు స్వయంగా గంగవ్వ ఇంటికి వెళ్ళిన నాగచైతన్య ఆమెకు 18 లక్షల రూపాయల చెక్‌ను అందజేశారట. గంగవ్వ ఇంటిని నిర్మించే కాంట్రాక్టర్‌కే ఆ డబ్బు మొత్తాన్ని ఇచ్చాడట నాగచైతన్య. దీంతో గంగవ్వ ఆనందానికి అవధుల్లేవట.