ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (21:50 IST)

టాలీవుడ్ హీరో వేధించాడా.. ఆ వార్తల్లో నిజం లేదు.. హన్సిక

Hansika
దేశముదురు స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ టాలీవుడ్ హీరో తనను వేధించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనతో డేట్‌కు రావాలంటూ తరచూ వెంటపడేవాడని వేధించే వాడని తెలిపింది. ఆ వేధింపులేక ఆ హీరోకి తగిన విధంగా బుద్ధి చెప్పినట్లు హన్సిక వెల్లడించింది. 
 
అయితే, ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం హన్సిక వెల్లడించలేదు. హన్సికను ఇంతలా ఇబ్బంది పెట్టిన ఆ టాలీవుడ్​ హీరో ఎవరై ఉంటారని, నెటిజన్లలో కొత్త చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో ఈ వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకుంది. 
 
ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజాగా హన్సిక స్వయంగా ప్రకటించింది. ఈ నిరాధారమైన ఊహాగానాలతో తాను విసుగు చెందానని ఇలాంటి కథనాలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకుని పోస్ట్ చేయాలని మీడియాను కోరింది. 
 
ముంబైకి చెందిన ఓ బిజినెస్​ మ్యాన్​ను వివాహం చేసుకున్న హాన్సిక అక్కడే సెటిలైంది. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం హన్సిక మోత్వాని పార్టనర్, 105 మినిట్స్, నా పేరు శృతి, రౌడీ బేబీ, గాంధారి, గార్డియన్ సినిమాల్లో నటిస్తోంది.