వకీల్ సాబ్ సరసన నేను నటిస్తానంటున్న ఇలియానా

శ్రీ| Last Modified శుక్రవారం, 20 మార్చి 2020 (21:59 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఏంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ గత రెండు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ సినిమాల్లో నటించమని అభిమానులు ఒత్తిడి చేయడంతో రీ ఎంట్రీకి సై అన్నారు. బాలీవుడ్లో కోలీవుడ్లో సక్సెస్ సాధించిన పింక్ మూవీ రీమేక్‌లో పవన్ నటిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసారని తెలిసింది. అంజలి, నివేథా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక పవన్ సరసన నటించేందుకు శృతిహాసన్‌ను సంప్రదించారని టాక్ వినిపించింది. గతంలో శృతిహాసన్, పవన్‌తో కలిసి గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల్లో నటించింది. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కాగా, కాటమరాయుడు యావరేజ్‌గా నిలిచింది. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ అయితే బాగుంటుదని ఆమెను కాంటాక్ట్ చేసారు.

లండన్‌లో ఉన్న శృతిహాసన్ రాగానే పవన్, శృతిహాసన్ పైన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు అనే టాక్ వచ్చింది. అయితే... పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సంవత్సరంలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో పవన్ సరసన నటించేందుకు శృతిహాసన్ ఓకే చెప్పందని... అందుచేత వకీల్ సాబ్‌లో నటించేందుకు శృతి ఇంట్రస్ట్ చూపించలేదని వార్తలు వచ్చాయి. అందుకనే గోవాబ్యూటీ ఇలియానాని కాంటాక్ట్ చేసారు.

వకీల్ సాబ్‌లో నటించేందుకు ఇలియానా ఓకే చెప్పిందని ప్రచారం జరిగింది. గతంలో పవన్‌తో కలిసి ఇలియానా జల్సా సినిమాలో నటించింది. ఆ సినిమాలో పవన్ - ఇలియానా జంట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇటీవల అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మరో అవకాశం రాలేదు. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ సరసన నటించే అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పిందని టాక్ వచ్చింది. తాజా వార్త ఏంటంటే.. ఇలియానా కాకుండా శృతిహాసన్‌నే ఫైనల్ చేసారని టాక్. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం.దీనిపై మరింత చదవండి :